రుద్రూర్: మండల పంచాయతీ అధికారి పి. లక్ష్మారెడ్డి నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలు అభినందనీయమని మండల నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో లక్ష్మారెడ్డి పదవి విరమణ మహోత్సవాన్ని గురువారం అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆయన దగ్గరకు వచ్చే వారికి ఎంతో ఓపిక గా మాట్లాడి సమస్య తెలుసుకుని పరిష్కారించే వారని అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయగౌడ్, ఎంపీడీవో భీమ్ రావ్, మోస్రా, రుద్రూర్ మాజీ జెడ్పీటీసీలు గుత్ప విజయభాస్కర్ రెడ్డి, నరోజి గంగారాం, విండో మాజీ చైర్మెన్ పత్తి రాము, విండో చైర్మెన్ సంజీవరెడ్డి, నాయకులు, తోట అరుణ్ కుమార్ ,పత్తి లక్ష్మణ్ ,తోట ,సంగయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
