ఘనంగా యోగా దినోత్సవం

బిచ్కుంద : మండలంలోని  పుల్కల్ హై స్కూల్ లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు పాటు యోగ చేయాలని సూచించారు. అనంతరం యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యురాలు ఉమా దేవి,  స్కూల్ హెడ్ మాస్టర్ ఆనంద్,  గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రకాష్, యోగ ఇన్సక్టర్లు బస్వంత్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.