రుద్రూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలోని బోయివాడలో పలువురి ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో నిరాశ్రయులయ్యారు. వీరికి బాలికల హైస్కూల్ లో పునరావాసం కల్పించారు. వరదా బాధితులకు మాజీ విండో చైర్మన్ పత్తి రాము బుధవారం ఉదయం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ..బాధిత కుటుంబాల సమస్యను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టి కి తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చేటట్టు తనవంతు కృషిచేస్తానని అన్నారు. మాజీ జెడ్పీటీసీ నరోజీ గంగారాం , మాజీ ఉప సర్పంచ్ నర్సయ్య, తోట సంగయ్య, కోడె శంకర్, అక్కపల్లి నాగేందర్,తోట అరుణ్, పార్వతి ప్రవీణ్, పత్తి నవీన్, అడప నవీన్, పవన్ తదితరులు ఉన్నారు.
