అంత్యక్రియలకు ఆర్థిక సాయం

కోటగిరి : మండల కేంద్రంలో గురువారం కుమ్మరి సాయిలు అనే వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు . మృతుడు నిరుపేద కావడంతో  అంత్యక్రియల కోసం  కుల పెద్దలకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెల్ల రవికుమార్ యువసేన అధ్యక్షులు తెల్ల రవికుమార్,  డాన్ రాజు, మా శెట్టి వర్షిత్ ,మారుతి ,కుమ్మరి సంఘం పెద్దలు కుమ్మరి పోశెట్టి, కుమ్మరి హనుమాన్లు, కుమ్మరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.