నసురుల్లాబాద్ (స్థానికం న్యూస్ ): రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రతి ఏటా ప్రచురించే సక్సెస్ స్టోరీస్ లో ఈ ఏట నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సక్సెస్ స్టోరీని ప్రచురించింది. గత ఏడాది రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ‘పాఠశాల రాజ్యాంగ తయారీ’ అనే అంశం రాష్ట్రవ్యాప్తంగా విద్యావేత్తలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎస్సీఆర్టీ విడుదల చేసిన మేగజైన్లు పాఠశాల సక్సెస్ స్టోరిని ప్రచురించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డి చందర్, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

