బీఆర్ఎస్ నేతల ఆర్థిక చేయూత


కోటగిరి:  భారీ వర్షాల వల్ల కోటగిరి మండల కేంద్రంలో నేల కూలిన ఇళ్లను శనివారం బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ఇల్లు నేలకూలి అద్దె ఇంట్లో ఉంటున్న పల్లికొండ సాయిలు అనిత దంపతులకు నగదును అందజేశారు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలాచూస్తామని హామీ ఇచ్చారు. గాండ్ల సాయిలు అనే వ్యక్తి ఇల్లు బ్రాహ్మణ గల్లి లో కూలిపోవడంతో ఇంటిని పరిశీలించారు. ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో రేకులు వేసుకునేందుకు రూ.ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డ వారి పక్షాన పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు తెలిపారు.అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షంలో నిలవడం బీఆర్ఎస్  లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి నేలకూలిన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు పరిహరం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  బీఆర్ఎస్ నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్ రావ్,కిషన్, తెల్ల రవికుమార్, విండో ఉపాధ్యక్షులు బొట్టే గజేందర్ ,సమీర్, శంకర్ గౌడ్ ,బాబు పటేల్, కప్ప సంతోష్ ,నజీర్, మహేష్ రెడ్డి ,తేల చిన్న అరవింద్ ,గౌతమ్ ,మామిడి నవీన్, యోగేష్ ,రుద్రంగి సందీప్ ,బోయ సంఘ అధ్యక్షులు సాయిలు, పోశెట్టి ,కుమ్మరి నాని ,కుమ్మరి పోశెట్టి ,కుమ్మరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు