రుద్రూర్: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై సాయన్న అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా తీసుకుంటే మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎఎస్సై రాజు, హెడ్ కానిస్టేబుల్ బండారు సురేష్, హెల్త్ వర్కర్ గౌరి, ఆశావర్కర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
