– గణనాథుని నామస్మరణ మారుమ్రోగుతున్న రుద్రూర్
రుద్రూర్: మండల కేంద్రంలోని సార్వ జనిక్ గణేష్ మండలి ఏర్పాటైన 75 ఏళ్లవుతున్న సందర్భంగా సిద్ది వినాయకుని డైమాండ్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం వినాయకున్ని వివిధ రకాల కూర గాయలతో (శాకాంబర) అలంకరించారు. కుంకుమార్చన, గణపతి హోమం నిర్వహించారు. గుడిమెట్ల ధర్మ పీఠం సద్గురు మహదేవ్ స్వామి భక్తులకు ప్రవచనం ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గణనాథుని వ త్తాంతంపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్ర లేఖనం, రౌండ్ చైర్, చెంచా గోటి పోటిలు ఏర్పాటు చేశారు.



