బీఆర్ఎస్ నాయకుల ధర్నా రాస్తారోకో

కోటగిరి : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం అసత్య ప్రకటనలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం కోటగిరి, రుద్రూర్, పోతంగల్ మండల కేంద్రాల్లో ధర్నా, రస్తారోకో  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయంలో కోటి ఎకరాలకు నీరందించేటట్టు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిందని అన్నారు. అభివృద్ధి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై వ్యతికేరత మొదలయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోటగిరిలో మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు తెల్ల రవి కుమార్, కిషన్, నవీన్, సమీర్, అరవింద్, గజేందర్, గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్లో నిర్వహించిన రస్తారోకోలో మండల బీఆర్ఎస్ ఇన్చార్జి గాండ్ల మధు, నాయకులు డౌర్ సాయిలు, జక్రి గజేందర్, మతిన్, శేఖర్, సాయిలు, పోతన్న తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ లో మండల పార్టీ ఇంచార్జీ నవీన్, నాయకులు ఆరీఫ్, ఆంజనేయులు, అజీముద్దీన్, సుదాం సాయిలు, సురేష్ పటేల్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.