సంపూర్ణ అక్షరాస్యత ఉల్లాస్ ఉద్దేశం

కోటగిరి: నిరక్ష్యరాస్యులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ ఉద్దేశమని పోతంగల్, రుద్రూర్ ఎంఈవోలు లోల శంకర్, కట్ట శ్రీనివాస్ అన్నారు. కోటగిరి, రుద్రూర్ మండల కేంద్రాల్లో మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన ఐకెపీ వీవోలు, టీచర్లకు ఒక రోజు మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ… ఉల్లాస్ కార్యక్రమం లక్ష్యం, ఉద్దేశాన్ని వివరించారు. ఉల్లాస్ లక్ష్య సాధనలో వాలింటర్లు తమ వంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమాల్లో రిసోర్సు పర్సన్స్ వడ్డే వీరేశం, మహజన్ నర్సింలు, కృష్ణ మోహన్, ఐకెపీ ఏపీఎం భాస్కర్, పీఆర్టీయు, తపస్ భాద్యులు బర్ల సాయులు, లోగం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.