రుద్రూర్ : వినాయకుని మండపాల్లో భజనలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని నవయుగ గణేష్ మండలి గణనాధున్ని తమలపాకులతో, సార్వ జనిక్ గణేష్ మండలి వినాయకున్ని 19వేల బిల్హపత్రాలతో అలంకరణ చేశారు. సిద్ధి వినాయకుని వద్ద హోమం నిర్వహించారు. ఇక్కడ హైదరాబాద్ కు చెందిన స్వామిజీ బంగారయ్య భక్తులకు ప్రవచనం ఇచ్చారు. శ్రీకృష్ణ యాదవ సంఘం గణేష్ మండలి లో కుంకుమార్చన నిర్వహించారు. ఇందూర్ గణేష్ మండలి, వివిధ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.



