హంగర్గాలో ఉచిత వైద్య శిబిరం


పోతంగల్ ( స్థానిక న్యూస్ ): మండలంలోని హంగర్గా ఫారం గ్రామంలో కోటగిరి కి చెందిన నాయకుడు బర్ల మధు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. కోటగిరి సంజీవని ఆసుపత్రి వైద్యురాలు  ఇంతియాజ్ బేగం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అనంతరం మధు ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, ప్రభాకర్, సాయిలు, సజ్జత్ తదితరులు పాల్గొన్నారు.