సిద్ధి వినాయకునికి నేతల పూజలు

రుద్రూర్: మండల కేంద్రంలో 75ఏళ్ల డైమాండ్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న సార్వజనిక్ గణేష్ మండలి సిద్ది వినాయకున్ని ప్రజాప్రతినిధులు, నాయకులు దర్శించి పూజలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వేర్వేరుగా మండపానికి వచ్చి గణనాథునికి పూజలు చేశారు. వారితో పాటు స్థానిక నాయకులు, గణేష్ మండలి సభ్యులు ఉన్నారు. పూజలు నిర్వహించిన నాయకులకు గణేష్ మండలి ఆధ్వర్యంలో సన్మానించారు.