ఘనంగా బతుకమ్మ సంబరాలు

బోధన్.. పోతంగల్ మండలం కల్లూరు, వర్ని మండలం జాకోరా ,  రుద్రూర్ మండలం చిక్కడపల్లి  గ్రామంలో సోమవారం బతు కమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో  తరలివచ్చి ప్రధాన కూడలిల వద్ద బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. మహిళలు ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ.. ఒక్క జాములాయే చందమామ.. రామ రామరామ ఉయ్యాలో… రామనే శ్రీ రామ ఉయ్యాలో అంటూ మహిళల పాటలతో  సంబరంగా అటలు ఆడుతూ బతుకమ్మలు ఆడారు. చిన్నారులు, మహిళల కోలాటాల నృత్యాలు ఆక ట్టుకున్నాయి. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మహిళలు , చిన్నారులు పాల్గొన్నారు.