రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సహిత విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య మేళన, రక్షాబంధనము, అఖండ దీపారాధన, గోపూజ, దేవతలకు కుంబాభిషేకము, మండపారాధన, శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణం, ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. భజనలు, సంకీర్తనలతో ఆలయం మారుమ్రోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిధిగా హజరైన బసవలింగ అవధూత మహరాజ్
శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూత మహారాజ్ హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ప్రవచనం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవరుచుకోవాలని ఉద్బోదించారు. ఆలయాలకు వెళ్లినపుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని, భక్తితోనే ముక్తి లభిస్తుందని, కొంత సమయాన్ని భగవంతుని సేవలో గడపాలని సూచించారు. ఈర్ష, అసూయలకు దూరంగా ఉండాలన్నారు. గురువు, దైవంపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉండలన్నారు. దాన ధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దైనందిన జీవితంలో ఒత్తిడి తగ్గించుకుని భగవన్నామ స్మరణ చేస్తే ప్రశాంతత లభిస్తుందని సూచించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి రామ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర, వీరేశం, గెంటీల సాయిలు, మోత్కూరి నారాయణ, లలేందర్, కర్క అశోక్, కొలస్ గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.


