ఆలయంలో శత సహస్ర దీపారాధన

రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత్రి నారాయణ కళ్యాణ మహోత్సవం, రుక్మిణి పాండురంగ కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శత సహస్ర దీపారాధన చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామ శర్మ, కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం, కౌలాస్ గంగాధర్, టీ. విజయ్, మోత్కూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పూజలు నిర్వహిస్తున్న భక్తులు