కోటగిరి: కళాశాల విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీ మహ్మద్ అబ్దుల్ బషీర్ సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. వంట గదిని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కళాశాల పరిసరాలు శుభ్రంగా ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రగతి పరిశీలించారు. ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ద చూపాలని, చదు లో వెనక బడ్డ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కళాశాల సిబ్బందీకి సూచించారు. ఆయన వంట కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ ముబీన్ ఉన్నారు.


