దివ్యాంగుల సేవనే విశ్వ మానవ సేవ

విశ్వ నాథ్  మహాజన్,  స్పెషల్ ఎడ్యుకేటర్

రుద్రూర్: దివ్యాంగులు అనగా దివ్యమైన అంగములు  కలవారు వీరిలో  ఉన్న  వైకల్యాలను చూడకుండా వారిలో  దాగి ఉన్న శక్తిని వెలికి తీయడమే  విలీన విద్య యొక్క  ముఖ్య ఉద్దేశం  మరియు దివ్యాంగుల నిజమైన సేవ.
  “దివ్యాంగులు  అందరూ మానవులే కానీ మానవత్వం లేని వాళ్ళందరూ దివ్యాంగులే”. దివ్యాంగుల యొక్క  వైకల్యాలను చూడకుండా వారి యొక్క సామర్ధ్యాలను గుర్తించాలి.వారిని  ప్రేమ ,ఆత్మీయతతో మేల్కొపాలి .ప్రతి ఒక్క దివ్యాంగుల్లో వైకల్యం అనేది కేవలం  శరీరానికే …కానీ మనసుకు కాదు  ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి  దృష్టిలో ఉంచుకోవాలి.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ పీ డబ్ల్యూ డి యాక్ట్ ప్రకారం  21 రకాల వైకల్యాల గల వ్యక్తులకు  4 శాతం రిజర్వేషన్లు కల్పించడం, విద్య, ఉపాధి మరియు వృత్తి శిక్షణ, రిజర్వేషన్లు, పరిశోధన మరియు మానవ వనరుల అభివృద్ధి, అవరోధ రహిత వాతావరణాన్ని సృష్టించడం, వైకల్యం ఉన్న వ్యక్తుల పునరావాసం, నిరుద్యోగం మరియు వ్యక్తుల కోసం గృహాల ఏర్పాటు వంటి పునరావాసం యొక్క నివారణ మరియు ప్రోత్సాహక అంశాలను చట్టం అందిస్తుంది .

ఆధునిక యుగంలో వివిధ రకాల నూతన ఆవిష్కరణ ద్వారా ఫిజియోథెరఫీ , స్పీచ్ థెరఫీ, ద్వారా ఎలాంటి  సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వివిధ రకాల వైకల్యాలను  అధిగమించవచ్చు.

  వివిధ రకాల ఒకేషనల్ శిక్షణతో పాటు  వివిధ రంగాలలో ఉపాధి కల్పించినట్లయితే  దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించవచ్చు  మరియు విద్యలో  నిరంతరం  కో కర్కులర్ మరియు  కరిక్యూలర్ యాక్టివిటీలలో నిమగ్నం చేయడం వల్ల  వ్యక్తుల/పిల్లల  సర్వాంగిన వికాసానికి తోడ్పడుతుందని   స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేటర్  డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ తెలియజేశారు.