పోతంగల్ : మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ
యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు . రైతు వేదిక తో పాటు వివిధ పాఠశాలల్లో యోగ డే జరుపుకున్నారు.ఈ సందర్భంగా యోగా ఇన్స్ట్రక్టర్స్ డి.సతీష్ గౌడ్, ఇందూర్ జ్యోతి అద్భుతమైన యోగాసనాల వేసి స్థానికులకు యోగ పై అవగాహన కల్పించారు. యోగ ద్వారా కలిగే ప్రయోజనాలను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్ ఆకుల రాధిక , హెల్త్ సూపర్వైజర్ సుజాత , మాజీ ఎంపీపీ పవన్ కుమార్ , ప్రకాష్ పటేల్ ,హనుమాన్లు, బచ్చు తిలక్ తదితరులు పాల్గొన్నారు.
