పార్టీలకతీతంగా ఘన సన్మానం

రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి సర్పంచ్ గా గెలుపొందిన మచ్కూరి రమేష్ ను  శనివారం వివిధ పార్టీల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.  చిక్కడపల్లి గ్రామ పంచాయతీ చరిత్రలో  ప్యానెల్  కు చెందిన వార్డు సభ్యులందరు గెలుపొందడం విశేషం. జర్నలిస్ట్ గా ప్రజల సమస్యలను పరిష్కారించడంతో ప్రత్యేక దృష్టి సారించిన రమేష్ సర్పంచ్ గా విజయం సాధించడం యదృచ్చికమేనని అన్నారు. కార్యక్రమంలో  బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గాండ్ల మధు, పార్టీ సీనియర్ నాయకులు డౌర్ సాయిలు, బొట్టె గజేందర్, కన్నె ప్రవీణ్, సిరిగాద శేఖర్, నీరడి సాయిలు, రవికిరణ్, బీజేపీ నాయకులు సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.