ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు

రుద్రూర్: మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. కేజీబీవీ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గూర్చి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండల ఇంచార్జి గాండ్ల మధు, బొప్పాపూర్ సంతోష్, నీరడి సాయిలు, జువ్వల శ్రావణ్, కన్నె ప్రవీణ్ , షేక్ షాదుల్, మేరాజ్ , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.