పోతంగల్ : కోటగిరి ఉమ్మడి మండలం నుండి పాదయాత్రగా బయలుదేరిన మాలధారణ స్వాములు ఈనెల 17న ( బుధవారం) స్వగ్రామానికి చేరుకొనున్నారు. గత నెల (నవంబర్) రెండవ తేదిన సువర్ణ భూమి శబరిమల మహపాదయాత్ర ఆధ్వర్యంలో కోటగిరి, పోతంగల్ కు చెందిన హన్మంత్ రావ్ , సుదాం వెంకటేష్, నాగేశ్వర్రావ్, ఈర్వంత్ రావ్ తదితరులు బయలు దేరారు. 16వందల కిలోమీటర్లు 43 రోజుల పాటు నడిచి ఈ నెల 14న శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్నట్టు సుదాం వెంకటేష్ టీచర్ తెలిపారు. పాదయాత్ర ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన అన్నారు.

