రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన మచ్కూరి రమేష్ ను బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా లయన్స్ చైర్మెన్ శ్యాంసుందర్ పహడే మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు రమేష్ జర్నలిస్ట్ గా ఈ ప్రాంత సమస్యలు పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చి పరిష్కారించారని కొనియాడారు. లయన్స్ సభ్యుడిగా గ్రామంలో ఆరోగ్య శిభిరాలు ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని అన్నారు. సర్పంచ్ గా సేవ కార్యక్రమాలు విస్తృతం చేస్తారని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కెవి మోహన్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, ప్రవీణ్ కుమార్, గాండ్ల మధు, ఇమ్రాన్, వడ్ల నరేష్, సందీప్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

