
రుద్రూర్ : మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం కాకుండా దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందుకోసం పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలో మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిసార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్‌కుమార్, డిసిసి కార్యదర్శులు పత్తి రాము, కర్క అశోక్, గౌస్, నెరుగంటి బాలరాజ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
