అర్హులైన పేదలకు పక్కా ఇల్లు

రుద్రూర్:  రుద్రూర్ జీపీ కార్యాలయం లో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి  సీతక్క ,  రాష్ట్ర ఆరు గ్యారెంటీలు అమలు,  ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జహీరాబాద్  ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ , బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు  నూతన పాలకవర్గం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  గత  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  చేసిన డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక సరిగా లేనందున ప్రస్తుత పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించాలని తీర్మానించారు. ఈ సర్వేను  గ్రామసభలో ప్రవేశపెట్టి అసలైన లబ్ధిదారులను ఎంపికచేసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ సమక్షంలో నిరుపేదలైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూంలు పంపణి చేయాలనీ తీర్మానించారు .  సమావేశంలో ఉప సర్పంచ్ నిస్స నిస్సార్,   పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.