ఘనంగా రిషికేశ్ జన్మదిన వేడుకలు

రుద్రూర్ : మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రాల్లో సీనియర్ జర్నలిస్ట్ కన్నె రవి కుమారుడు కన్నె రిషికేశ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు బిస్కెట్లు, స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా రిషికేశ్  కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్తులో ఉన్నత పదవులు అందుకోవాలని అశీర్వదించారు. కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్లు ప్రతిమ, సునంద, గంగామని, పద్మ, నాయకులు కన్నె రవి, జమిల్, హజీ, వెంకటేష్, ఆర్మీ జవాన్ తోట వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.