
రుద్రూర్ : మండల కేంద్రంలోని శ్రీవాణి సాహితి విద్యానికేతన్‌లో శనివారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పిల్లలతో గాలిపటాలు ఎగురవేయడం, రంగోలి పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, పాలు పొంగించడం వంటి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సందడి చేశారు.
పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉపసర్పంచ్ షేక్ నిస్సార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…పండుగల ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లోగం నాగరాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


