వివోఎల నిరవధిక సమ్మె ప్రారంభం

రుద్రూర్ :  డిమాండ్ల సాధనకై ఐకెపి వివోఎ ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు.  మండల కేంద్రంలోని  ప్రభుత్వ సమీకృత భవన సముదాయం ఎదురుగా చేపట్టిన సమ్మెలో  వివోఏ లు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, సాధారణ,  ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వివో ఏ ల సంఘం మండల అధ్యక్షురాలు జరీనా, కార్యదర్శి స్వరూప, కోశాధికారి లావణ్య,  మాణిక్యమ్మ, గంగారాం, సాయిబాబా, వీరేశం తదితరులు పాల్గొన్నారు.