బీమా యోజన చెక్కుల అందజేత

పోతంగల్: మండలంలోని కల్లూర్ కెనరా బ్యాంకులో సోమవారం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ముగ్గురు లబ్ధిదారులకు క్లెయిమ్ చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.  కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు లింగప్ప, సాయినాథ్, వడ్ల సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.