పాదయాత్ర భక్తులకు అల్పాహారం అందజేత

రుద్రూర్: పిట్లం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం పాలు, పండ్లు,  బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరి ప్రశాంత్ గౌడ్, బాన్సువాడ బీజేపీ సీనియర్ నాయకులు మార్కలి ప్రకాష్ పటేల్, పార్వతీ మురళి ,రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, భోజికొండ అనిల్, రేపల్లి సాయిప్రసాద్, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, యువమోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల కోశాధికారి వి.రామరాజు, రజినీకాంత్, నడిపి రాజేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని భక్తులకు సేవలందించారు.