రుద్రూర్: గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ , ఉప సర్పంచ్ షేక్ నిస్సర్లను శాలువాలు కప్పి సన్మానించారు.


అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలో 14 ఏండ్ల లోపు విభాగంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న హైస్కూల్ విద్యార్థి సాయినాథ్‌ను ఘనంగా అభినందించి సన్మానించారు. విద్యార్థి సాధించిన విజయం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా సర్పంచ్ తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రేందాస్, హైస్కూల్ పీఈటీ సంతోషి తదితరులు పాల్గొన్నారు.

