

బోధన్ : ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నెలలోపే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, పోతంగల్ ఎంఈఓ గా విధులు నిర్వహించిన లోల శంకర్ ఉద్యోగ విరమణ సందర్భంగా పట్టణంలోని రవి గార్డెన్లో శనివారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులకు సంబంధించిన హెల్త్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
లోలా శంకర్ విద్యారంగానికి అందించిన సేవలను పలువురు వక్తలు కొనియాడగా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా అధ్యక్షుడు పి.మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుశాల్, జిల్లా మాజీ అధ్యక్షులు ఇల్తెపు శంకర్, లక్ష్మణ్ పటేల్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జలంధర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు గంట అశోక్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గోపిడి రవీందర్ రెడ్డి , పోతంగల్ మండల పీఆర్టీయూ అధ్యక్షుడు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. ప్రశాంత్ కిరణ్ బాబు, ఎంఈఓ సాయిలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు హన్మండ్లు, రామారావు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
