
రుద్రూర్ (స్థానికం న్యూస్ ): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలో రజక దంపతులపై దాడి చేసి పసి పాపను పొట్టన పెట్టుకున్న అగ్రవర్ణ దురహంకారులను కఠినంగా శిక్షించాలని రుద్రూర్ రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మంళవారం రాత్రి మండల కేంద్రంలో రజక సంఘం నుండి బస్టాండ్ వరకు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు, చౌరస్తాలో కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. దైవ దర్శనానికి వెళ్లిన రజక దంపతులను అవమానించి పసి పాపను కాళ్లతో తన్ని దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు నాగభూషణం, సాయికుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
