పోతంగల్: మండల కేంద్రంలో ఉన్న అతి పురాతన శ్రీరామ్ మందిరంలో మంగళవారం శ్రీరామ నవమి సందర్భంగా వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చండి యాగం, విష్ణు యాగాలను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.
మందిర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీరామ్ మహారాజ్, బ్రహ్మశ్రీ శ్రీనివాస్, బ్రహ్మశ్రీ గజానన్ ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ సతీష్, బ్రహ్మశ్రీ అనంత్ మహారాజ్, బ్రహ్మశ్రీ రాజు మహారాజ్ యాగాలు నిర్వహించి హోమాలను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి ప్రత్యేక అతిథిగా హాజరై యాగాలలో పాల్గొన్నారు. అలాగే మండల బీజేపీ నాయకులు పబ్బ శేఖర్, శ్రీకర్ మహారాజ్, శేఖర్ సేట్, గంధపు హనుమాన్లు, పగల నవీన్, రాజు, నాగయ్య, గంగారం తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పెద్దలు కిషన్ రావు, కృష్ణ వేణి, లలితా శర్మ, లీలావతి తదితర భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరాముని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.


