వాసవి మాత జయంతి ఉత్సవాలు

పోతంగల్:  మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సభ్యులు వాసవి మాత ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.