ఘనంగా మహిళా దినోత్సవం

కోటగిరి:  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పీఆర్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని మహిళ టీచర్లను కార్యక్రమానికి ఆహ్వనించి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిధిగా హజరైన పీఆర్డీయు జిల్లా అధ్యక్షుడు పి.మోహన్ రెడ్డి హజరై మాట్లాడుతూ… మహిళ టీచర్ల సమస్యల పరిష్కారం, టీచర్ల హక్కుల సాధనలో పీఆర్టీయు కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్ రావ్, పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు బర్ల సాయిలు, ఉదయ్ చందర్, మహిళ ఉపాధ్యక్షురాలు సుమన సుచిత్ర వాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంగ రాజు, సుధీర్, నరేష్, హర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.