
రుద్రూర్ : విద్యార్థులు వేసవి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని తహసీల్దార్ తారాబాయి సూచించారు. మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్థుల కోసం స్వచ్ఛంద సంస్థ ‘రైడ్స్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ తరగతులను సోమవారం తహసిల్దార్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధి కోసం ఉచితంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సబ్జెక్టుల్లో వచ్చే సందేహలను ఎప్పటి కప్పుడు ఉపాద్యాయుల దృష్టికి తెచ్చి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ కట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ నిసార్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాంసింగ్, బాలికల ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పద్మావతి, రైడ్స్ అధ్యక్ష, కార్యదర్శులు కర్రాల్ల కృష్ణ ప్రసాద్, పార్వతి శేఖర్, అసోసియేట్ అధ్యక్షుడు మహజన్ నర్సింలు, ఆడ్వైజర్ కెవి మోహన్, వార్డు సభ్యులు అమంద్ వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నోట్ బుక్స్, పెన్నుల అందజేత
వేసవి శిక్షణ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు రుద్రూర్ హైస్కూల్ 1995-36 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు నోట్ బుక్స్, పెన్నులు అందచేశారు. విద్యార్థులకు అల్పాహరం అందచేయడానికి ముందుకు వచ్చిన దాతలకు, స్వచ్ఛందంగా తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. తరగతులకు సమీప ఋమండలాల్లోని విద్యార్థులు కూడా వస్తున్నారని, తొలి రోజు 54 మంది శిక్షణ తరగతులకు హాజరయినట్టు పేర్కొన్నారు.

