ఘనంగా మేడే వారోత్సవాలు 



బోధన్/సాలూరా  . మేడే వారోత్సవాల సందర్భంగా సిఐటియు, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో సాలూరా, బోధన్ మండలాల్లో శనివారం వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాలూరు మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల నాయకుడు విజయ్ పటేల్ సిఐటియు జెండాను ఆవిష్కరించారు.

బోధన్ మండలం ఏరాజుపల్లి గ్రామంలో సీపీఎం బోధన్ డివిజన్ కమిటీ సభ్యుడు కుప్రియాల బాలయ్య పార్టీ జెండాను ఆవిష్కరించగా, ఊటుపల్లి గ్రామంలో సీపీఎం మండల నాయకుడు దండు సాయిలు జెండా ఆవిష్కరణ చేపట్టారు. అదే గ్రామంలో సిఐటియు జెండాను సీపీఎం శాఖ కార్యదర్శి సుంకరి లక్ష్మి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాలకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏశాల గంగాధర్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్మికులు, కర్షకులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వాలను ఎదుర్కోవాలంటే దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, పేద ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వడం ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ కార్మిక సంఘం సాలూరా మండల నాయకులు పి.రాజీ, రామారావు, సతీష్, శంకర్, గంగారాం, మారయ్య, సక్కుబాయి, లక్ష్మి, భూమవ్వ సాయవ్వ, స్వరూప, నల్ల సాయిలు, ఆసరి లింగం, బోయి మదర్, రాజు, రాములు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.