ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

రుద్రూర్: మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా ఫుడ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలోగురువారం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కె.వి. వెంకట్ రెడ్డి, ప్రశాంతి  హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమతుల ఆహారం ప్రాధాన్యత, పోషకాహారపు అలవాట్లు, ఆరోగ్యకర జీవనశైలిపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన ఆహారంపై వివరించారు. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందేలా రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు కవల శిశువులకు అన్నప్రాశన కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు మొదటిసారి అన్నం తినిపించే ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గంగామణి,  స్థానిక సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.