ఉపాధి కూలీలకు అల్పాహారం

బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
రుద్రూర్ :  మండల కేంద్రంలోని  గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

పని ప్రదేశంలో నీడ లేకపోవడం, ఫోటో నమోదుకు ఎక్కువ సమయం పట్టడం వంటి ఇబ్బందులను కూలీలు వివరించారు. ఫోటో నమోదు ప్రక్రియ వేగవంతం చేయడానికి అదనంగా మరో ఇద్దరు మేట్లకు బాధ్యతలు అప్పగించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన చంద్రశేఖర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కర్క అశోక్, వార్డు సభ్యులు అమంద్ వెంకటేష్, శివకుమార్, మండల నాయకులు వడ్ల నరేష్, ఇందూర్ కార్తీక్, అడ్ప సాయిలు తదితరులు పాల్గొన్నారు.