అమ్మమ్మ ఊరిలో చిన్నారుల సందడి

రుద్రూర్:  వేసవి సెలవులు ప్రారంభం కావడంతో చిన్నారులు అమ్మమ్మల ఊర్లకు చేరుకుని సందడి చేస్తున్నారు. పట్టణాల హడావుడికి దూరంగా గ్రామీణ వాతావరణంలో స్నేహితులతో కలిసి ఆటపాటలతో కాలాన్ని ఆనందంగా గడుపుతున్నారు. సంప్రదాయ ఆటలతో పాటు కొత్త ఆటల్లోనూ మునిగిపోయి నరదాగా గడుపుతున్నారు. రాత్రి వేళల్లో కూడా స్నేహితులతో కలిసి కథలు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

అమ్మమ్మ ప్రేమగా , రుచిగా వండి పెడుతున్న వంటకాలను ఆస్వాదిస్తూ పిల్లలు సెలవులను మధుర జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నారు. గ్రామాల్లో చిన్నారుల సందడి పెరగడంతో పల్లెల్లో మళ్లీ పాత రోజుల వాతావరణం కనిపిస్తోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాకు ఆడుకోవడం చాలా ఇష్టంరిత్విక నిజామాబాద్

రుద్రూర్ లో నా బెస్ట్ ఫ్రెండ్ విలాసిని. నేను అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడల్లా విలాసినితో కలిసి బొమ్మల ఆటలు, దాగుడుమూతలు ఆడుకుంటాను. విలాసిని చెల్లెలు శ్రీనిక కూడా మాతో కలిసి ఆడుతుంది. మేమంతా కలిసి చాలా ఆటలతో ఎంజాయ్ చేస్తాం.

అమ్మమ్మ రుచిగా తినిపిస్తుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. తిన్నాక మళ్లీ బయటకు వెళ్లి ఆడుకుంటాం. విలాసిని, శ్రీనికలతో ఆటలంటే ఎంతో ఇష్టం. అందుకే అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని ఎప్పుడూ మారం చేస్తా..

రిత్వికతో ఉంటే ఇంటికి వెళ్లాలనిపించదు.,.విలాసిని, రుద్రూర్,

మా అమ్మమ్మ ఊరు నిజామాబాద్. సమ్మర్ హాలిడేస్ వస్తే సంతోషంగా ఉంటుంది. రుద్రూర్ కు మా ఫ్రెండ్ రిత్విక వస్తే నేను ఇక్కడే ఉండి రోజంతా ఆడుకుంటా. నిజామాబాద్ వెళ్లినపుడు కూడా రిత్విక ఇంటికి వెళ్లి మళ్లి కలిసి ఆడుకుంటాం. అమ్మమ్మ ఇంట్లో ఉండడం నాకు చాల ఇష్టం.