అక్కాచెల్లెళ్లకు ప్రతిభా పురస్కారాలు

రుద్రూర్: జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ పట్టణంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా రుద్రూర్ మండలానికి చెందిన మహాజన్ అక్కాచెల్లెళ్లు అక్షయ శ్రీ మహాజన్, సుషిర శ్రీ మహాజన్ ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. ఇంటర్మీడియట్‌లో సుషిర శ్రీ మహాజన్ 970/1000 మార్కులు, పదవ తరగతిలో అక్షయ శ్రీ మహాజన్ 570/600 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
విద్యార్థినులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పోల విట్టల్ గుప్త పురస్కారాలు అందజేశారు.
కార్యక్రమంలో రుద్రూర్ మండల ఆర్యవైశ్య కార్యదర్శి జి. పురుషోత్తం, విద్యార్థినుల తల్లిదండ్రులు మహాజన్ నర్సింలు, డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.