– తహసీల్దార్ తారాబాయి

రుద్రూర్ : మహిళ చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పద్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారాబాయి మాట్లాడుతూ….మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు చట్టాలు, జీఓ లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు ఆత్మ విశ్వాసంతో పాటు, ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి శిక్షణ తీసుకోవాలన్నారు. సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ మాట్లాడుతూ…ప్రపంచంలో సగభాగమైన మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తే మహిళల సమస్యలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం బస్వంత్ రావు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీలత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి, మండల సమాఖ్య అధ్యక్షురాలు దృపతి, వివిధ యూనియన్ల నాయకులు గంగామణి, ప్రేమల, సుధా, స్వాతి, అంగన్ వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

