
ఆడకూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ తండ్రులకు తలకు మించిన భారమే.. దాన్ని అర్థం చేసుకున్న భైరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాథోడ్ రవి తనవంతు చేయుత ను అందిస్తున్నాడు. బొప్పాస్పల్లిలో బుధవారం జరిగిన కర్ర సర్దార్ కుమార్తె సోని బాయి వివాహానికి రూ. పది వేలు అందించి దాతృత్వం చాటుకున్నాడు. ఉపాధ్యాయుడు రవి దాతత్వం పట్ల స్థానికులు, ఇతర ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.