రుద్రూర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావ్ ను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డిని శుక్రవారం వివిధ మండల నాయకులు పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు . కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నం సాయిలు , ప్రశాంత్ గౌడ్ , ఈల్తేమ్ శంకర్ , రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, వి .రామ్ రాజు, కృష్ణం రాజు,కుమ్మరి గణేష్, బోజిగొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
