

కోటగిరి: నూతన పంచాయతీ పాలక వర్గం అభివృద్ది ప్రాధాన్యం ఇవ్వాలని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే అత్యధిక మోజారిటీతో గెలుపొందిన సర్పంచ్ స్థానాల్లో కోటగిరి ప్రథమంగా ఉంటుందన్నారు. అత్యధిక మోజారిటి ఇచ్చిన ప్రజలకు అదే తీరులో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలని సూచించారు. కోటగిరి గ్రామ సర్పంచ్ గెలుపొందిన బర్ల మధుకర్ మాట్లాడుతూ …అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారంలో ముందుంటానని అన్నారు. కార్యక్రమంలో బోధన్ డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో విష్ణు, తహసీల్దార్ గంగాధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
