ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు

మోస్రా : మండలంలోని చింతకుంట వృద్ధాశ్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పార్లమెంటరీ దిశా కమిటీ సభ్యులు నడిపింటీ  నగేష్  ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో కాంగ్రెస్ మండలఅధ్యక్షులు తోట. అరుణ్ కుమార్, మోస్రా అద్యక్షులు కొత్మిర్ కార్ లక్ష్మణ్, బాన్సువాడ కిసాన్ కేత్ అధ్యక్షులు శనిగరం కిషన్ , మాజీ విండో చైర్మన్ పత్తి రాము ,ఏ.ఎం.సీ మాజీ చైర్మన్ బందెల సంజీవులు, డి.సీ.సీ డెలిగేట్ ప్రవీణ్ కుమార్ గౌడ్, నాయకులు అక్కపల్లి నాగేందర్,  రామాగౌడ్,  రాంబాబు,  తోట సంగయ్య, రజాక్, దూడ నరేష్ ,మచ్చేందర్, ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.