ముమ్మరంగా వాహనాల తనిఖీ

రుద్రూర్: మండల కేంద్రంలో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాలు, కార్లను ఆపి తనిఖీ చేశారు. బ్రీత్ ఎనలైజర్ వినియోగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడుతారనే విషయాన్ని విస్మరించవద్దని ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చారు.  నిర్దేశిత సమయంలోపు ఇండ్లకు వెళ్లిపోవాలని సూచించారు ఎస్సైతో పాటు ఏఎస్పై గంగాధర్, హెడ్ కానిస్టేబుల్ అంజాద్, సిబ్బంది ఉన్నారు.