ప్రత్యేక పూజలు,అన్నదానం

రుద్రూర్ : మండలంలోని వివిధ గ్రామాల్లోని వినాయక మండపాల్లో గత ఎనిమిది రోజులుగా  భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఇందూర్ గణేష్ మండలి గణనాథున్ని బుధవారం  విద్యార్థులు దర్శించుకున్నారు. ఇక్కడ  మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  గత 25 ఏళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు . శ్రీ కృష్ణ యాదవ సంఘం గణేష్  మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని వద్ద  శ్రీనివాస్ పంతులు సమక్షంలో కుంకుమార్చన నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, కమిటీ అధ్యక్షుడు డౌర్ సాయిలు, కోడె శంకర్, రవి , శ్రీనివాస్ ,గజేందర్, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.