ప్రజా ప్రతినిధుల  ప్రమాణ స్వీకారం

రుద్రూర్ : మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన జీ పీ పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాలకు వచ్చి సర్పంచ్, ఉపసర్పంచ్,  వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక నాయకులు, అభిమానులు  వారిని కల్సి సన్మానించి అభినందనలు తెలియజేశారు.